Monday, December 23, 2024

ముందస్తు సాగుకు సన్నద్ధమవ్వాలి

- Advertisement -
- Advertisement -

వ్యవసాయరంగాన్ని కాపాడుకోవాలి
ప్రకృతి వైపరీత్యాలతో కలిగే పంటనష్టాలు తప్పించాలి
జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి దిశా నిర్దేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ముందస్తు పం టల సాగుకు సిద్ధం కావాలి.. వ్యవసాయరంగాన్ని కాపాడుకోవాలి..ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటనష్టాలను తప్పించాలి ..ఈ దిశగా ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని చర్యలు తీసుకుందాం అని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. గురువారం కలెక్ట సమావేశంలో సీఎం అధ్యక్షతన ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలోనూ, ఇటీవల యాసంగిలోనూ ఈదురు గాలులు, అకాల, భారీ వర్షాలు, వడగళ్భవానలతో వరి, మొక్కజొన్న, మిర్చి, కూరగాయలు, పండ్ల తోటలకు కోత దశలో ఉన్న పంటలకూ, వేరు వేరు దశలలో ఉన్న పంటలకు నష్టం వాటిల్లింది.

తెలంగాణలో సాధారణంగా వడగండ్ల వానలు ఏప్రిల్ మాసం నుండి కురుస్తూ ఉంటాయి. 2023 యాసంగిలో వడగండ్ల వానలు, భారీ వర్షాలు నెలాఖరులోనే కురిసి పంటలకు, తద్వారా రైతులక నష్టం కలుగజేసాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వడగండ్ల వానలను, భారీ వర్షాలను తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా పరి పంట ముందస్తు సాగుకు ప్రభుత్వం రైతులకు అవగాహన కల్గించడానికి సిద్ధమైంది. వానాకాలం వరి పంట సాగును ముందస్తుగా చేపట్టడం వలన పంటను అక్టోబర్ మూడవ వారం నుంచి నవంబర్ మొదటి వారం లోపు కోసుకోవచ్చు. అలాగే యాసంగి వరి నారును నవంబర్ 15 నుండి 20 కల్లా సిద్ధం చేసుకుంటే, పంటను మార్చి 3వ వారం నుండి ఏప్రిల్ మొదటి వారానికల్లా కోసుకోవ చ్చు. మొత్తంగా వడగండ్ల వానలను, భారీ వర్షాలను తప్పించుకోవచ్చు.

ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ ప్రాం తాలలో ముందస్తు సాగుకు సమయాలు: 140 రో జుల అంతకన్నా ఎక్కువ దీర్ఘకాలిక రకాలు – మే 25 నుండి జూన్ 5 వరకు నార్లు పోసుకోవాలి. 135 రోజుల పంట కాలం కలిగిన మధ్యకాలిక రకాలు – జూన్ 15 వరకు, 125 రోజుల పంట కాలం కలిగిన స్వల్పకాలిక రకాలు – జూన్ 25 వరకు నార్లు పోసుకోవాలి. ప్రాంతాల వారీగా శాస్త్రవేత్తలు సూచించిన మధ్యకాలిక రకాలు (135 రోజు లు), స్వల్పకాలిక రకాలు (125 రోజు లు). వానాకాలం పంట అక్టోబర్ 3వ వారం నుంచి న వంబర్ మొదటి వా రంలోపు పంట కోతను పూర్తి చేయ డం. యాసంగి నారు నవంబర్ 15 నుంచి 3 మధ్య సిద్ధం చేసుకోవడం ద్వారా చలి వాతావరణాన్ని తప్పించుకోవడం. యాసంగి పంట లు కోత మార్చ్ 3వ వారం నుంచి ఏప్రిల్ మొదటి వారం లోపు పూర్తి అయ్యేలా చూడడం, యాసంగి వరిని ఏప్రిల్ మొదటి వారం లో కోసుకోవడం వలన ఎక్కువ గింజ లభిస్తుంది.మిల్లు పట్టినప్పుడు సూక శాతం తగ్గుతుంది.

ప్రచార కార్యక్రమాలు
ముందస్తు వరి సాగుకు సంబంధించి ప్రాంతాల వారీ సూచనలతో కూడిన కరపత్రాలు రైతులకు పంచడం (క్లస్టర్కు 500 చొప్పున) నిపుణులతో రైతు వేదికలలో సాగు ప్రారంభానికి ముందే సమావేశాలు నిర్వహించడం (ప్రతి మంగళ, శుక్ర వారాలలో), వరి ముందస్తు సాగుకు సం బంధించిన విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించి రైతులకు అవగాహన కలిగించడం (మంగళ, శుక్రవారాలు మినహాయించి క్లస్టర్ లో గ్రామల వారీగా ప్రచారం చేపట్టడం). క్లస్టర్ స్థాయిలో రైతు శాస్త్రవేత్తలతో చర్చా కా ర్యక్రమాలు చేపట్టడం జరగాలి. ఈ ప్రచార కార్యక్రమాల గురించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా రై తులకు సమాచారం అందించడం. రైతుల అవగాహనను పెంపొందించడానికి లఘు చిత్రాలను రూపొందించి వాట్సప్ మాధ్యమం [సోషల్ మీడియా] ద్వారా రైతులకు చేరవేయడం జరగాలి.

ఎనిమిది మంది మంత్రులతో కూ డిన సబ్ కమిటీని ముందస్తు సాగుపై అధ్యయనం చేసి, తగిన ప్రచార కార్యక్రమాలను రూపొందించడం కోసం ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర, జిల్లా, క్లస్టర్ స్థాయిలో వానాకాలం , యాసంగి పంటల ముందస్తు సాగుకు సంబంధించిన సూచనలను వారం రోజుల్లో రూపొందించడానికి నిర్ణయించింది. శాస్త్రవేత్తలు సూచించిన విధంగా వానాకాలం, యాసంగి పంటల ముందస్తు నాటుకునే సమయాలపై నెలవారీగా ప్రణాళిక రూపొందించి అమలు చేయడం కోసం జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించమని జిల్లా కలెక్టర్ లను కోరింది. క్లస్టర్ వారీగా ఆయా ప్రాంతాలకు అనువైన రకాలు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం అధికా ర యంత్రాగాలకు దిశా నిర్దేశం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News