Tuesday, January 7, 2025

ఎన్నికలకు సిద్ధం కండి

- Advertisement -
- Advertisement -

అలంపూర్ : మండల పరిధిలోని భీమవరం గ్రామంలో అలంపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాము ఏ ర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా ఏఐసిసి కార్యదర్శి మాజీ శాసన సభ్యులు డా. ఎస్‌ఏ సంపత్‌కుమార్ పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా సంపత్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థుల బలిదానాలతో గుండె కదిలి తల్లి సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో కుటుంబ, నియంత పాలన కొనసాగుతో ందని, తెలంగాణ ప్రజలు గడీల పాలనలో బందీలయ్యారని టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై సంపత్‌కుమార్ మండిపడ్డాడు.

కేజీ టూ పీజీ ఇంటికో ఉద్యోగం రైతుకు లక్ష రుణమాఫీ, డబల్ బెడ్ రూం, మూడెకరాల భూమి మైనార్టీలకు రిజర్వేషన్ లాం టి హామీలు ఇచ్చి మాట తప్పి తెలంగాణ ప్రజలను మోసం చేశాడని కేసిఆర్‌పై దుయ్యపట్టారు. మళ్లి ఇప్పుడు రాబోతుంది ఇందిరమ్మ రాజ్యమేనని ఈ రాజ్యంలో సిలిండర్ ధర తగ్గింపు పంట నష్టం చెల్లింపు ఇందిరమ్మ ఇంటికి ఐదు లక్షలు, రైతు సబ్సిడి విత్తనాల, సబ్సిడి ఎరువులు, రెండు లక్షల రుణామాఫీ, రెండు లక్షల ఉద్యోగాలు, విద్యార్థినీలకు స్కూటీలు లాంటి సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మారుస్తుందని అన్నారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సంపత్‌కుమార్‌ని ఆదరించి కాంగ్రెస్‌ని బలపర్చే ఓటర్లుగా కేసిఆర్ గడీల పాలన గద్దె దింపే సైనికులుగా పని చేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ భీమవరం శేఖర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు రాము, ఉండవల్లి మండల అధ్యక్షుడు గోపాలు, ఇటిక్యాల మండల అధ్యక్షుడు రుక్మధరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎర్రవల్లి రవి , మహిళా అధ్యక్షురాలు నాగశిరోమణి, పిసిసి అధికార ప్రతినిధి పేక్షావలిచారి, పేక్షావలి ఆచారి , జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మద్దిలేటి జిల్లా కార్యదర్శి బుక్కాపురం లక్ష్మణ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్‌గౌడ్, యోగిరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసులు, టౌన్ అధ్యక్షుడు ఆసిఫ్ ఖాన్, పచ్చర్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News