Sunday, January 19, 2025

ఎన్నికలకు సిద్దం కండి

- Advertisement -
- Advertisement -
  • కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్

వడ్డేపల్లి: మండల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం శాంతినగర్‌లోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఏఐసిసి కార్యదర్శి మాజీ శాసనసభ్యులు డా. ఎస్‌ఏ. సంపత్‌కుమార్ పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు.

ఈ సందర్భంగా సంపత్‌కుమార్ మాట్లాడుతూ కర్ణాటక తరహాలోని తెలంగాణలో కూడా కాంగ్రెస్ విజయం తథ్యమన్నారు. రేవంత్‌రెడ్డి పిసిసి అయ్యాక కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయి కేసిఆర్ కుటుంబాన్ని ఎదుర్కునే శక్తి సాధించింది అన్నారు. మళ్లీ ఇప్పుడు రాబోతుంది ఇందిరమ్మ రాజ్యమేనని ఈ రాజ్యంలో సిలిండర్ ధర తగ్గింపు పంట నష్టం చెల్లింపు ఇందిరమ్మ ఇంటికి ఐదు లక్షలు, రైతు సబ్సిడీ విత్తనాల, సబ్సిడీ ఎరువులు, రెండు లక్షల రుణమాఫీ, రెండు లక్షల ఉద్యోగాలు , విద్యార్థినీలకు స్కూటీలు లాంటి సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మారుస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రామకృష్ణఆరెడ్డి, వడ్డేపల్లి టౌన్ అధ్యక్షుడు చిన్నిబాబు , జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగశిరమని , ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వడ్డేపల్లి దేవేంద్ర కిసాన్ అధ్యక్షుడు నాగరాజు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు పున్నారావు జగన్‌గౌడ్, కరుణాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం శీను, విశ్వనాథరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యప్రసాద్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణకాంత్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు యోహన్ , అలంపూర్ మండల అధ్యక్షుడు రాము, రాజోలి మండల అధ్యక్షుడు దస్తగిరి, మున్సిపల్ వైస్ చైర్మన్ సుజాత , రెండో వార్డు కౌన్సిలర్ సుజాత, నాలుగో వార్డ్ కౌన్సిలర్ దేవమ్మ, మైనార్టీ అధ్యక్షుడు మైనుద్దీన్, అయిజ టౌన్ ప్రెసిడెంట్ ఆలోచనమ్మ, అన్ని మండలాల మహిళా అధ్య౭ఉరాలు , కొంకల యోగిరెడ్డి, పచ్చర్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News