Wednesday, January 22, 2025

అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి సిద్ధం చేయండి

- Advertisement -
- Advertisement -

వరంగల్ కార్పొరేషన్ : రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఈనెల 17న నగరంలోనీ వివిధ ప్రాంతాల్లో పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు నిర్వహించనున్న వేళ వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా అన్నారు. గురువారం బల్దియాకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కలిసి మంత్రి పర్యటించు ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎం.జీ.ఎం. కూడలి,గోపాల స్వామి టెంపుల్ ఏరియా,దేశాయ్ పేట లోని జర్నలిస్ట్ కాలనీ, మండి బజార్,వరంగల్ చౌరస్తా, వరంగల్ పోస్ట్ ఆఫీస్ కూడలి, వరంగల్ బస్ స్టాండ్, ఉర్స్ ఎస్.టి.పి. ఉర్సు రంగలీల మైదాన్, ఉర్సు దర్గా ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ లక్ష్మీ మెగా టౌన్షిప్ ప్రాంతంలో చెత్త కుప్ప లను తొలగించాలని,వరంగల్ చౌరస్తా ప్రాంతం లో ఫొటో ఎగిబిషన్ ఏర్పాటు చేయాలని,పోస్టాఫీసు కూడలి వద్ద ఆగిఉన్న నీటినీ తొలగించేలా చూడాలని అన్నారు. ఎస్.టి.పి.వద్ద గోడల పై చిత్రించే పెయింటింగ్ సంబంధిత చిత్రాలను పరిశీలించిన కమిషనర్ ఇక్కడ ప్లాంటేషన్ చేయాలని అన్నారు. ఎస్.టి.పి.ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలని,ఉర్సు రంగలీల మైదానం లో ఉన్న డేబ్రిస్ సు తొలగిం పజేయాలని ఈ సందర్భం గా శానిటేషన్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ అదనపు కమి షనర్ అనిసూర్ రషీద్, ఎస్. ఈ.లు కృష్ణ రావు, ప్రవీణ్ చంద్ర, సిటీ ప్లానర్ వెంకన్న, సీఎంహెచ్ ఓ డా.రాజేష్, సిహెచ్‌ఓ శ్రీనివాసరావు, బయాలజిస్ట్ మాధవ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస రెడ్డి,ఎం.హెచ్. ఓ.డా.జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News