Monday, December 23, 2024

రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేయండి

- Advertisement -
- Advertisement -
అధికారులకు సిఎస్ ఆదేశం

హైదరాబాద్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జులై 4 న హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. సోమవారం డా.బిఆర్ అంబెడ్కర్ సచివాలయంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సిఎస్ సమన్వయ సమావేశం ఏర్పాటుచేశారు. డిజిపి అంజనీ కుమార్ తోపాటు పలు శాఖల ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ జులై 4 సాయంత్రం అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి ఉత్సవాలలో రాష్ట్రపతి పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని అన్నారు.

ఈ కార్యక్రమం జరిగే మార్గాలలో రోడ్ల మరమ్మతులు, బారికేడింగ్ చేపట్టాలని కోరారు. ఈ పర్యటన సందర్భంగా విస్తృత బందోబస్తు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య బృందాలను నియమించడం, తగు పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ప్రోటోకాల్ ను అనుసరించి ఏవిధమైన లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలని సిఎస్ కోరారు. ఈ సమీక్ష సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్ శర్మ, అర్వింద్ కుమార్, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ జైన్,ఫైర్ సర్వీసుల డిజి నాగిరెడ్డి, కార్యదర్శులు శేషాద్రి, శ్రీనివాస రాజు, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్ ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ బి. రాజమౌళి తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News