Monday, December 23, 2024

కలిసొచ్చే పార్టీలతో పనిచేయడానికి సిద్ధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు క్రమశిక్షణ, ఐక్యతతో పనిచేసి ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. క్రమశిక్షణ, సామరస్యంతో పనిచేసి విజయం సాధించి సిద్ధంకావాలని తెలిపింది.

85వ ప్లీనరీ సమావేశంలో ఆమోదించిన ఐదు అంశాల రాయ్‌పుర్ డిక్లరేషన్‌లో రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, సవాళ్లను పరిష్కరించడానికి, ఉమ్మడి, నిర్మాణాత్మక కార్యక్రమం ఆధారంగా సమాన ఆలోచనలు కలిగిన రాజకీయపార్టీలతో కలిసి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ప్రకటించింది. త్వరలో కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు 2024 లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని కాంగ్రెస్ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News