Monday, December 23, 2024

స్టూడెంట్ మాదిరిగానే ప్రిపేర్ అవుతున్నా : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జిల్లాల్లో పర్యటిస్తూ తీరిక లేకుండా గడుపుతున్న రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ తన బిజి షెడ్యూల్ గురించి ఓ ట్వీట్ చేశారు. గత వారం రోజుల నుంచి ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభల్లోనూ ప్రసంగిస్తున్నారు. ఒకే రోజు నాలుగైదు కార్యక్రమంలో పాల్గొంటూ వస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాల పర్యటనకు హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న సమయంలో దొరికిన ఆ కొద్ది సమయంలో తదుపరి ఈవెంట్ గురించి ప్రిపేర్ అవుతున్నానని మంత్రి కెటిఆర్ సదరు ట్వీట్‌లో పేర్కొన్నారు. దాదాపు ఓ విద్యార్థి పరీక్షకు ప్రిపేర్ అవుతున్న మాదిరిగానే తన షెడ్యూల్ ఉందని కెటిఆర్ తన ట్వీట్‌లో ప్రస్తుతించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News