Friday, September 20, 2024

భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Badrachalam
భద్రాచలం: పాల్గుణ పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలోని స్వామి వారి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఏప్రిల్ 10న శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆలయ అధికారులు శుక్రవారం నుంచి శ్రీరామ నవమి ఉత్సవాల పనులను ప్రారంభించారు. ప్రధాన ఆలయంలోని మూల మూర్తులు, ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని చిత్రకూట మండపంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం స్థానాచార్యులు స్థల సాయి నేతృత్వంలో రోలు, రోకలికి దేవతలను ఆవాహన చేసి పసుపు దంచే వేడుకను చేపట్టారు. అలా తయారు చేసిన పసుపుతో తంబ్రాలను సిద్ధం చేశారు. బేడా మండపం వద్ద డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. ఏప్రిల్ 9న సీతారాములకు ఎదుర్కోలు ఉత్సవం, 10న కళ్యాణోత్సవం, 11న పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఏర్పాట్లను ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి శివాజీ పర్యవేక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News