Sunday, March 23, 2025

జయ బచ్చన్‌ కామెంట్స్‌కి నిర్మాత కౌంటర్

- Advertisement -
- Advertisement -

‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ సినిమా గురించి కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ నటి, ఎంపి జయ బచ్చన్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అక్షయ్ కుమార్, భూమి ఫడ్నేకర్ నటించిన ఈ సినిమా రూ.70 కోట్లతో రూపొంది.. రూ.300 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అయితే తాను సినిమాలు చేసే విషయంలో చాలా సెలక్టివ్‌గా ఉంటానని జయ బచ్చన్ అన్నారు. ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ అనే టైటిల్ లాంటి పేరు ఉన్న సినిమాలు తాను చూడను అని.. అందుకే ఆ సినిమా ఫ్లాప్ అని జయ పేర్కొన్నారు.

అయితే తన సినిమాపై విమర్శలు చేసే ముందుకు ఆ చిత్రానికి వచ్చిన బాక్సాఫీస్ కలెక్షన్లు చూడాలని నిర్మాత ప్రేరణ అరోరా అన్నారు. జయా బచ్చన్ అంటే తనకు ఎంతో అభిమానమని.. తాను ఎంతో ఇష్టపడే నటి నుంచి ఇలాంటి మాటలు వినడం చాలా బాధగా ఉందని ప్రేరణ అన్నారు. ఆమె తమ చిత్రాన్ని ఫ్లాప్ అనే ముందు.. బాక్సాఫీస్ కలెక్షన్లు చూడాలని పేర్కొన్నారు. ఆ సంవత్సరం(2017)లో విడుదలైన భారీ హిట్ చిత్రాలలో తమ సినిమా కూడా ఉందన్నారు. కథకు అనుగుణంగా ఎంతో ఆలోచించి ఆ టైటిల్ పెట్టామని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News