Monday, December 23, 2024

తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

President and PM wish the people of Telangana

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రగతి సూచిలో గణనీయమైన పురోగతిని సాధించిందని, పారిశ్రామిక హబ్‌గా రాష్ట్రం ఆవిర్భవించిందని రాష్ట్రపతి ప్రశంసించారు. రాష్ట్రం మరింత పురోభివృద్ధి సాధించి ప్రజల ఆశయాలు నెరవేరాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధాని మోడీ కూడా తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ ప్రజలు కష్టజీవులని, దేశ ప్రగతికి వారు చూపుతున్న అంకితభావం అపూర్వమని అన్నారు. తెలంగాణ సంస్కృతి ప్రపంచఖ్యాతి గడించిందని, తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నానని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News