Saturday, November 23, 2024

‘విరాట్’కు రాష్ట్రపతి, ప్రధాని వీడ్కోలు

- Advertisement -
- Advertisement -

President and Prime Minister bid farewell to Virat

న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ ‘విరాట్’కు వీడ్కోలు పలికారు. ఈ విరాట్ ఎవరంటే..ప్రెసిడెంట్ బాడీగార్డ్ దళంలో సేవలందించిన ఒక అశ్వం. ఇది ఇప్పటివరకు 13 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లలో పాల్గొంది. వయసు మీద పడడంతో ఇప్పుడు దీని సేవలకు ముగింపు పలికారు. ఈ పరేడ్ ముగిసిన తర్వాత రాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు ఈ అశ్వం చెంతకు వెళ్లారు. ఆప్యాయంగా తట్టి వీడ్కోలు పలికారు. ఇదిలా ఉండగా దీని సేవలకు గుర్తుగా .. ఈ నెల 15న ఆర్మీ డే సందర్భంగా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్( ప్రశంస) లభించింది. ఇలాంటి సత్కారం పొందిన తొలి అశ్వం ఇదే కావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News