Thursday, November 14, 2024

దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని హోళీ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: హోళీ పండగ సందర్భంగా దేశ ప్రజలందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా తన కుటుంబ సభ్యులని, ప్రతివారి జీవితంలో అభిమానం, సామరస్యం పెంపొందించే ఈ పండగ కొత్త శక్తిని, ఉత్సాహాన్ని తీసుకురాగలదని ప్రధాని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజలు నిర్వహించే హోళికా దహన్ చెడును దహించడానికి సంకేతమని, అంతకు ముందు దేశం మొత్తం మీద ఈ పండగను రంగురంగుల జల్లులతో, తమ సంప్రదాయ రీతుల్లో జరుపుకోవడం ఆనందదాయకమని ప్రధాని మోడీ తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

హోళీ పండగ ప్రజల్లో ప్రేమ, సోదరభావం, సమైక్యత పెంపొందిస్తుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం తన సందేశంలో వివరించారు. వివిధ రంగులు ఆనందంతో వెదజల్లే పండగైన ఈ పండగ దేశం లోని వైవిధ్యతకు ప్రతిబింబమని, మన సాంస్కృతిక వారసత్వాన్ని మరింత బలోపేతం చేసేలా స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. జీవితాల్లో ఆశను, అత్యాసక్తిని ప్రేరేపిస్తుందన్నారు. ప్రతివారి జీవితంలో ఈ పండగ రంగులు ఆనందం కలిగించాలని తాను ఆకాంక్షిస్తున్నానని రాష్ట్రపతి తన సందేశంలో అభిలషించారు. మనందరి అభిప్రాయాలు కొత్త ఉత్సాహంతో జాతి నిర్మాణం వైపు సాగాలని సూచించారు. దేశం లోను, విదేశాల్లోను నివసిస్తున్న భారతీయులందరికీ తన శుభాకాంక్షలు అందిస్తున్నట్టు ఆమె చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News