Friday, November 22, 2024

పశుపతి పరాస్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు పశుపతి కుమార్ పరాస్ తన కేంద్ర మంత్రి పదవికి చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోదించారు. ఈమేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు పరాస్ నిర్వహించిన మంత్రిత్వశాఖ అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బీహార్‌లో సీట్ల పంపకాల్లో తమ పార్టీకి బీజేపీ అన్యాయం చేసిందని ఆరోపిస్తూ పశుపతి కుమార్ తన కేంద్ర మంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

బీహార్‌లో పొత్తులో భాగంగా చిరాగ్ పాశ్వాన్ నేతృత్వం లోని ఎల్జేపీ (రాంవిలాస్ ) పార్టీకి ఎన్డీయే ఐదు సీట్లు కేటాయించింది. దీనిపై పశుపతి పరాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. “ప్రధాని మోడీ గొప్పనేత. ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. కానీ బీహార్‌లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో మాకు అన్యాయం జరిగింది. మా పార్టీకి ఐదుగురు ఎంపీలు ఉన్నా పొత్తులోమాకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అందుకే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా” అని పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయనను బీహార్ లోని ప్రతిపక్ష కూటమికి ఆర్జేడీ ఆహ్వానించింది.

ఒక వేళ పశుపతి పరాస్ బీహార్ ప్రతిపక్ష కూటమి లోకి రావాలనుకుంటే మేము స్వాగతం చెప్పడానికి ఎప్పుడూ సిద్ధమే ” అని ఆర్జేడీ నేత తేజ్‌ప్రతాప్ యాదవ్ అన్నారు. మరోవైపు బీహార్ రాష్ట్రంలో మొత్తం 40 లోక్‌సభ స్థానాలు ఉండగా, అత్యధికంగా బీజేపీ 17 స్థానాల్లో పోటీ చేయనుంది. సీఎం నితీశ్ కుమార్‌కు చెందిన జేడీయూ 16 సీట్లలో పోటే చేసేందుకు అంగీకారం కుదిరింది. మిగిలిన రెండు ఎన్డీయే భాగస్వామి పార్టీలైన హిందుస్థానీ అవామ్ మోర్చా, ఉపేంద్ర కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీ చెరో ఒక్కో స్థానాల్లో పోటీ చేస్తాయని బీజేపీ బీహార్ రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జి వినోద్ తాడ్వే వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News