Tuesday, September 17, 2024

అభినందన్‌కు వీర్‌చక్ర ప్రదానం

- Advertisement -
- Advertisement -

President awards Vir Chakra to Abhinandan Varthaman

 

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని అత్యంత సాహసోపేతంగా కూల్చేసిన భారత వైమానిక దళం పైలట్, వింగ్ కమాండర్ (గ్రూప్ కెప్టెన్) అభినందన్ వర్ధమాన్‌కు ప్రతిష్టాత్మక ’వీర్ చక్ర’ అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. ఢిల్లీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అభినందన్ స్వీకరించారు. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. అభినందన్ 2019, ఫిబ్రవరి 27న ఎల్‌ఒసి వ్ద్ద పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16, ఎఫ్-17 యుద్ధ విమానాలను తన వద్ద ఉన్న రాడార్ సాయంతో పసికట్టాడు.. పొంచి ఉన్న ముప్పును గ్రహించి ఎంతో చాకచక్యంగా మిసైల్‌తో ఎఫ్-16ను కూల్చేశాడు. ఇదే క్రమంలో పిఒకె నుంచి తిరిగి వస్తుండగా మిగ్-21 ఢీకొట్టడంతో శత్రుదేశ అధీనంలోని ప్రాంతంలో విమానం నుంచి కిందపడ్డారు. వెంటనే పాకిస్థాన్ సైన్యం ఆయనను అదుపులోకి తీసుకుంది. దీనిపై భారత ప్రభుత్వంతో పాటు, అంతర్జాతీయ సమాజం జోక్యంతో అభినందన్‌ను భారత్‌కు పాక్ తిరిగి అప్పగించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News