Monday, January 20, 2025

గన్‌సేఫ్టీ బిల్లుపై బైడెన్ సంతకం

- Advertisement -
- Advertisement -

President Biden signs Gun Safety Bill

ప్రాణాల రక్షణ చర్యగా స్పందన

వాషింగ్టన్ : అమెరికాలో అపూర్వరీతిలో వచ్చిన గన్‌సేఫ్టీ బిల్లుపై దేశాధ్యక్షులు జో బైడెన్ సంతకం చేశారు. దీనితో దేశంలో ఇటీవలికాలంలో తీవ్రస్థాయికి చేరిన గన్‌కల్చర్ కట్టడికి వీలు కల్పించే చట్టం వచ్చింది. ఇది చారిత్రక పరిణామం అని, ప్రాణాలను నిలిపే చర్య అని వైట్‌హౌస్‌లో బైడెన్ స్పందించారు. ఎందరో ఈ గన్‌కల్చర్‌తో బలి అయ్యారు. వారికోసం వారి ఆత్మీయులు తల్లడిల్లారు. వారిని తాను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నానని, విచక్షణారహిత కాల్పుల ఉన్మాదుల కట్టడికి ఏదైనా చేయాల్సి ఉందని బాధితుల బంధువులు , స్నేహితులు కోరారని దీనిని తాము పరిగణనలోకి తీసుకున్నామని , ఇప్పుడు ఈ బిల్లు చట్టరూపం దాల్చడం కీలక పరిణామం అయిందని బైడెన్ తెలిపారు. యూరప్‌లో రెండు కీలక సదస్సులలో పాల్గొనడానికి వెళ్లేముందు బైడెన్ ఈ గన్‌సేఫ్టీ బిల్లుపై సంతకం చేశారు. తరువాత విలేకరులతో మాట్లాడుతూ ఉన్మాదుల చర్యల నుంచి ఇక విము క్తి అని వ్యాఖ్యానించారు. ఈ చట్టం అత్యంత కటుతరం అని తాను చెప్పడం లేదని, తాము కోరుకున్నవాటన్నింటిని బిల్లులో కొన్ని ప్రతిబంధకాలతో పొందుపర్చలేకపోయినట్లు, అయితే పౌరుల ప్రాణాల రక్షణకు తాను ఇంతకాలం ఆలోచిస్తూ వచ్చిన అంశాలు ఇందులో ఉన్నాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News