భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర పర్యటన మంత్రిత్వ శాఖ ద్వారా 41.38 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీ భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. భారత రాష్ట్రపతికి సాంప్రదాయ బద్దంగా పూర్ణ కుంభం, మేళతాళాలతో వేద మంత్రోత్సవాలతో స్వాగతం పలికారు. ఆలయంలో మూల వరులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీతాయారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో వైదిక సిబ్బంది వేద ఆశీర్వచనం అందచేశారు. అనంతరం భద్రాద్రి దేవస్థానం తరపున రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పట్టు వస్త్రాలు అందచేశారు.
అంతకముందు బిపిల్ పాఠశాలలో రాష్ట్రపతికి రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిలిసై సౌందరాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు మాలోత్ కవిత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పి చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, భద్రాచలం శాసనసభ్యులు పోదెం వీరయ్య, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఐజీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డా వినీత్, పర్యాటక శాఖ ఎండి మనోహర్, వేదపండితులు స్థలసాయి, మురళి, గోపి, ప్రధాన అర్చకులు విజయరాఘవన్, రామస్వరూప్ తదితరులు పాల్గొన్నారు.