- Advertisement -
భారత రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేడ్కర్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. పార్లమెంట్ ఆవరణలో ఘనంగా అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్కి పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు ఘన నివాళి అర్పించారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పలు పార్టీలు సిద్ధమయ్యాయి. కాగా, ఇవాళ అంబేద్కర్ జయంతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
- Advertisement -