Wednesday, January 22, 2025

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

- Advertisement -
- Advertisement -

దేశ గౌరవాన్ని ఇనుమడింప చేస్తున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్
విద్యార్థులు పర్యావరణం, ప్రకృతి పై అవగాహన పెంచుకోవాలి

మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన విద్యార్థుల ప్రతిభ దేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తోందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించనున్నారని చెప్పారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ 100 సంవత్సరాలలో చదువులో ఉన్నత స్థాయికి చేరుకున్న విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.

మైక్రోసాఫ్ట్ సిఈఓ, పద్మభూషణ్ నాగేశ్వరరావు లాంటి అనేకమంది గొప్పవాళ్లు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన విద్యార్థులేనని అన్నారు. పాఠశాలలోని విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత గురువులపై ఉందని రాష్ట్రపతి అన్నారు. విద్యార్థులు పర్యావరణం, ప్రకృతి పై అవగాహన పెంచుకోవాలని ఉద్బోధించారు. విద్యార్థులందరూ కేవలం తమ స్వార్ధ ప్రయోజనాలు కాకుండా వేరే వారికి సహాయపడే అలవాటు చేసుకోవాలని సూచించారు.

గౌరవ అతిథి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎంపీలు, ఎంఎల్‌ఎలు, బ్యాంకింగ్ రంగ నిపుణులు సిఎలు, న్యాయవాదులు ఇలా అనేక రంగాల్లో ఈ సంస్థ ఎంతో మంది దిగ్గజాలను తయారు చేసిందని కొనియాడారు. ఇక్కడి విద్యార్థులను ఎంపీలు, గవర్నర్లు, రాజకీయ నాయకులుగా తయారు చేయడం చూస్తున్నానన్నారు. ఇక్కడ చదువుకున్న విభిన్న నేపథ్యాల విద్యార్థులు గొప్ప సేవ చేశారన్నారు. . రాష్ట్ర, దేశాభివృద్ధికి పాటుపడిన విద్యార్థులను పాఠశాల తయారు చేసిందన్నారు. పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి , మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, బి వెంకటేశం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనానరు. గ్రాండ్ ఫినాలే వేడుకలు రాష్ట్రపతి జెండా ఊపి ప్రారంభించారు. గ్రాండ్ ఫినాలే వేడుకలు ఈ నెల 27 వరకు కొనసాగుతాయి. విద్యార్థుల మనోహరమైన శాస్త్రీయ నృత్య ప్రదర్శన వేడుకకు సాంస్కృతిక కోణాన్ని జోడించి, విశిష్ట అతిథులు, హాజరైన వారి నుండి ప్రశంసలను అందుకుంది.

Draupadi Murmu

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News