Monday, December 23, 2024

ఎయిర్‌ఫోర్స్ సేవలు భేష్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సవాళ్లను ఎదుర్కొనేందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు నిచ్చారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమిలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రివ్వూయింగ్ ఆఫీసర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం నాడు హాజరయ్యారు. గ్రాడ్యుయేట్ నుండి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ కంబైంన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలు గుర్తుంచుకోవాలని చెప్పారు. టర్కీలో జరిగిన భూకంపంలో కూడా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బాగా పని చేసిందని కొనియాడారు.

ఏప్రిల్‌లో సుఖేయ్ జెట్‌లో ప్రయాణించడం తనకు చాలా గొప్ప అనుభూతి అని చెప్పుకొచ్చారు. ఫైటర్ జెట్ ఫైలెట్లలో మహిళలు సైతం అధికంగా ఉండటం సంతోషదాయకంగా ఉందన్నారు. ఈ సందర్భంగా క్యాడెట్ల నుండి రాష్ట్రపతి ముర్ము గౌరవ వందనం స్వీకరించారు. ఆకట్టుకున్న వైమానిక దళ విన్యాసాలు.. కాగా ఈ సందర్బంగా నిర్వహించిన సైనిక విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా రాష్ట్రపతి ముర్ము విన్యాసాలు చేసిన వారిని పలుసార్లు చప్పట్లు చరిచి తన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రగవర్నర్ తమిళి సౌ సౌందర రాజన్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కాగా ఉదయం రాజ్ భవన్ నుండి దుండిగల్ చేరుకున్న రాష్ట్రపతి ముర్ము ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఒక ఆడబిడ్డగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చీరను బహుమతిగా అందజేశారు.

అలాగే ఈ సందర్బంగా మంత్రి సత్యవతి రాథోడ్ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, అలాగే గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌కు సంప్రదాయ పద్దతిలో చీరలను బహుకరించారు. కాగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌ను ముగించుకుని బేగంపేట విమానాశ్రయం నుండి రాష్ట్రపతి తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్రపతి ముర్ముకు ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో మంత్రి సత్యవతి రాథోడ్‌తో పాటు సీఎస్ శాంతి కుమారి, డిజిపి అంజనీ కుమార్, ఇతర శాఖల ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News