ఢిల్లీ: భారత చలనచిత్ర రంగం ఉన్నతిలో ఎన్టీఆర్ పాత్ర కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ అన్నారు.యుగ పురుషుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా ఎన్‌టిఆర్ రూ.100 స్మారక నాణెంను రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్మూ మాట్లాడుతూ.. భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీఆర్ ఎంతో ప్రత్యేకం. రాముడు, కృష్ణుడి వంటి పాత్రల్లో ఆయన నటన అద్భుతం. రాముడు, కృష్ణుడి రూపాలను ప్రజలు ఆయనలో చూసుకున్నారు. రాముడు, కృష్ణుడిగా ప్రజల్లో ఆయన చెరగని ముద్ర వేశారు. రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ తన ప్రత్యేకత చాటుకున్నారు. సామాజిక న్యాయం కసం ఆయన ఎంతో కృషి చేశారు.
రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో సోమవారం జరిగిన ఎన్‌టిఆర్ నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.