Friday, January 31, 2025

వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌ దిశగా అడుగులు పడుతున్నాయి: ద్రౌపది ముర్మూ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశ అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ చేరాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ తెలిపారు. త్వరలోనే భారత్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా మధ్యతరగతివారేనని, వాళ్ల కోసం 8వ పేకమిషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ద్వారా లక్షలాది మంది సొంతింటి కల నెరవేరుతోందని, 3 కోట్ల పేద కుటుంబాలకు ఇళ్లు నిర్మిస్తున్నామని వివరించారు. అమృత్‌ భారత్‌, నమో భారత్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయని, వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌ దిశగా అడుగులు పడుతున్నాయన్నారు.

బ్యాంకింగ్ డిజిటల్ వ్యవస్థను తీసుకొచ్చామని, నూతన విద్యా విధానంతో ఆధునిక విద్యా వ్యవస్థ ఏర్పాటు చేశామని, మానవ సంహిత అంతరిక్ష యాత్రలు చేసే రోజు ఎంతో దూరంలో లేదని, కృత్రిమమేధ అభివృద్ధికి ఇండియా ఎఐ మిషన్‌ను ప్రారంభించామని ద్రౌపది తెలియజేశారు. డిజిటల్ సాంకేతికతలో భారత కీలక పాత్ర పోషిస్తోందని, సామాజిక న్యాయం, సమానత్వ సాధనకు డిజిటల్ సాంకేతికత వాడుతున్నామని, స్టార్టప్‌లు, క్రీడలు, అంతరిక్ష రంగాల్లో యువత దేశానికి వన్నె తెస్తోందని, మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ సేవల కల్పనలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని ముర్మూ ప్రశంసించారు. 3 లక్షల మంది మహిళలను లక్‌పతి దీదీలుగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, డ్రోన్‌ దీదీ స్కీమ్‌.. మహిళలకు ఉపయోగపడుతోందన్నారు. నేషనల్ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ప్రారంభించామని, భారత్‌ను గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ పవర్‌హౌస్‌గా మారుస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News