Saturday, November 23, 2024

ఈ నెల 28న రామప్పకు రానున్న రాష్ట్రపతి ముర్ము

- Advertisement -
- Advertisement -

రామప్ప : ఈనెల 28న ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయానికి భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రానున్నారు. రాష్ట్రపతి పర్యటనలో భాగంగా రామప్పలో పకడ్భందిగా ఏర్పాట్లు చేసి ఏలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి పర్యటనను కోనసాగించే దిశగా పోలీసుల అధికారులు చాకచక్యంగా వ్యవహరించాలని ములుగు జిల్లా ఎస్పి సంగ్రాంసింగ్ జీ పాటిల్ పోలీసు అధికారులకు సూచనలు చేశారు. గురువారం రామప్పలో రాష్ట్రపతి పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హెలిప్యాడ్, దేవాలయ సుందరికరణ, ఏర్పాట్లతో పాటు పలురకాల ఏర్పాట్లపై పోలీసు అధికారులతో పాటు రెవెన్యూ అధికారులకు సూచించారు. రామప్పలో మూడు హెలిప్యాడ్‌లు, వి ఆకారంలో ల్యాండ్ అయ్యో విధంగా మైదానం చదును చేయడంతో పాటు విధ్యుత్ స్థంబాలను స్వీప్ట్ చేయాలని సంబందిత అధికారులతో మాట్లడి సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.

పార్కింగ్ ఏరియాలో భారీగా భారికేడ్లు ఏర్పాటు చేయాలని, చెరువు కట్టపై పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈనెల 26 న కేంద్రం నుంచి పోలీసులు బలగాలు ములుగు చేరుకోని రామప్పను చుట్టు ముట్టే అవకాశం ఉన్నట్లు తెలస్తోంది. ఆలాగే రామప్ప పర్యటనకు వచ్చే సందర్శకులను రెండు రోజులు అంటే 27,28న పర్యటకులను రామప్పకు అనుమతి ఇవ్వబోమని ఇప్పటికే అధికార వర్గాలు తెలియజేశారు. ప్రోటోకాల్ విషయంలో ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో ఆయన వెంట ములుగు ఎఎస్పి రాంనాద్ కేకాన్, ములుగు డీఆర్‌వో రమాదేవి, ములుగు జిల్లా పోలీస్‌లు,మరియు రెవెన్యూ అధికారులతో పాటు స్థానిక సర్పంచ్ డోలి రజిత శ్రీనివాస్, పురవస్థుశాఖ జిల్లా అధికారి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News