Monday, December 23, 2024

పేదల ప్రతిబింబాన్ని

- Advertisement -
- Advertisement -

నా విజయం పేదలు, దళితులు, అట్టడుగు వర్గాలది రాష్ట్రపతిగా తొలి
ప్రసంగంలో ద్రౌపది ముర్ము భావోద్వేగం అట్టహాసంగా ప్రమాణస్వీకారోత్సవం
ప్రమాణం చేయించిన ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ హాజరైన
అతిరథ మహారథులు ముర్ముకు సర్వోన్నత పదవి ప్రజాస్వామ్యంలోని
మహా అద్భుతం : వెంకయ్యనాయుడు అభినందనలు బడుగులకు ఇదో
చిరస్మరణీయ ఘట్టం : ప్రధాని మోడీ పార్టీలకతీతంగా అభినందనల
వెల్లువ చైనా అధినేత జిన్‌పింగ్ సహా పలువురు దేశాధినేతల శుభాకాంక్షలు

న్యూఢిల్లీ : సంతాలీ గిరిజన తెగల సమున్నత ఖ్యాతిని ప్రస్తావిస్తూ, పరాయి పాలనపై కొండజాతి వీరుల తిరుగుబాట్లను, వారి భాష ఘనతను ప్రస్తావిస్తూ కొత్త రాష్ట్రపతి ద్రౌపదీ ము ర్మూ తొలి ప్రసంగం పార్లమెంట్ సెంట్రల్‌హాల్ లో సభికుల నిశ్శబ్ధాల మధ్య 18 నిమిషాల పాటు సాగింది. ఆమె పదవీ స్వీకరణ ఆమోద ప్రసంగం గంభీరతతో సాగింది. ఆమె ప్రసంగం గిరిజన సాంప్రదాయక నమస్తే అయిన జొహర్‌తో ఆరంభం అయ్యి, ప్రఖ్యాత ఒడిషా కవి సాధువు భీమ్ భోయి కవితా పంక్తులతో ముగిసింది. భారతదేశ గిరిజన సంస్కృతి వారసత్వ ఘనత విశిష్టమైనదని తెలిపారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కొండలు కోనలు లోయల్లోని గిరిజనులు, ఆదివాసీలు, కొండజాతులు తమ ప్రాంతాలలో చేపట్టిన దండుయాత్రలతో పాలుపంచుకున్నారని సంతాలీ తెగకు చెందిన రాష్ట్రపతి ద్రౌపదీ తెలిపారు. సంతాల్, పైకా, కోల్, బిల్లుల విప్లవాలు వివిధ ప్రాంతాల గిరిజనుల ఆ వేశాల నుంచి రగులుకున్నవే తెలిపారు.

దేశ స్వాతంత్య్ర సిద్ధికి గిరిజనుల ప్రా తినిధ్యం ఎంతో ఉందన్నారు. సామాజిక అభ్యున్నతి, దేశభక్తికి ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముం డ జీ చేసి న త్యాగాలు ఎనలేనివని , తాము వీరి స్ఫూర్తితో సాగుతున్నామని ముర్మూ తెలిపారు. బిర్సా ముండా బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరు సల్పిన కొండజాతి నేతగా పేరొందారని తెలిపారు. ప్రకృతితో మమేకం అయ్యి జీవించే గిరిజనులు ఆదివాసీలు సామరస్యానికి ప్రతీకలు అని,ఇదే సమయంలో అటవీ ప్రాంతాలలోని ప్రాచీన పద్ధతులు , స్థిరమైన ఆరోగ్యకరమైన జీవన విధానాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రపంచం పరితపిస్తోన్న రక్షిత భూగోళానికి ప్రాతిపదికలు అవుతాయని రాష్ట్రపతి తెలిపారు. తాను ప్రకృతిపరమైన ప్రశాంత వాతావరణపు గిరిజన కుటుంబంలో పుట్టానని, ఈ సంప్రదాయం వేలాది సంవత్సరాలుగా కాలంతో సమన్వయపర్చుకుంటూ సాగిందని చెప్పారు. అడవులు, జలాశయాలు, నదులు పర్వతాలు జీవరాశులు ప్రకృతి పరిరక్షణకు ఎంతగా అవసరం అనేది తాను గుర్తించానని చెప్పారు.

మనకు అవసరం అయిన వనరులను మనం ప్రకృతి నుంచి తీసుకుంటున్నప్పుడు మన మనుగడ సాగిస్తున్నప్పుడు సహజంగానే మనం కూడా ఆ ప్రకృతికి అవసరం అయిన బలోపేత చర్యలను తీసుకోవల్సి ఉంటుందని పిలుపు నిచ్చారు. ఇది కేవలం భారత్‌కు లేదా ఏ ఒక్క దేశానికో పరిమితం అయిన సమీకరణం కాదు. ప్రపంచవ్యాప్తంగా నెలకొని అల్లుకుని పోతున్న అత్యంత కీలకమైన తెంచలేని సున్నితమైన పరిణామం అయిందని ద్రౌపదీ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రపంచ వ్యాప్త అంశం అయింది. ఈ దిశలో భారతదేశం మార్గదర్శకం అవుతున్నందుకు తాను సంతోషిస్తున్నానని చెప్పారు. ఒడిషా గిరిజన కవి భీమ్ భోయి కవితా పంక్తులను చదివి విన్పించారు ‘ మో జీబన్ పఛ్చే నర్కే పడితో , జగతో ఉధార్ హీ ’ అని పేర్కొన్నారు. దీని అర్థం ప్రపంచ క్షేమం కోసం పాటుపడటం వ్యక్తి బాగుకోసం పనిచేయడంతో పోలిస్తే ఆకాశమంత సమున్నతం.

పేద ఆడబిడ్డ కలలు కనొచ్చు
నిజం చేసుకోవచ్చు
్రఓ నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టిన ఆడబిడ్డ కూడా దేశ అత్యున్నత పదవి చేపట్టేందుకు కలలు కనవచ్చు, సాకారం చేసుకోవచ్చు అని దేశ ప్రజాస్వామ్యంలోని శక్తి నిరూపించిందని ముర్మూ తెలిపారు. ఓ మట్టి ఇంటి నుంచి రాష్ట్రపతి భవనపు సౌధం వరకూ సంకల్పం ఉంటే చేరుకోవచ్చునని తన ఈ యాత్ర నిరూపించిందని చెప్పారు. ఒడిషాలోని మయూర్‌భంజ్ జిల్లా మారుమూల గ్రామం నుంచి సాగిన పయనం ప్రజాస్వామ్యం ఇచ్చే అవకాశంతో ఫలవంతం అయిందన్నారు. తాను ఉన్నత సౌధానికి చేరినా తన మూలాలు గ్రామీణ అట్టడుగు వర్గాల స్పందనలకు అనుగుణంగా ఉంటాయని, తనలో దేశ అణగారిన వర్గాలు, పేదలు, దళితులు గిరిజనులు తమ ఆశలను ప్రతిఫలింపచేసుకోవచ్చునని అన్నారు. ప్రాధమిక విద్య పొందడం కూడా దుర్లభం అయిన గ్రామం నుంచి తాను వచ్చానని , ఆ తరువాత ఈ గ్రామం నుంచి కాలేజి విద్యదశకు చేరుకున్న తొలి వ్యక్తిని తానే అయ్యానని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News