Monday, December 23, 2024

పార్లమెంటులో ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ముర్ము

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సెంట్రల్ హాల్‌లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె లోక్‌సభ, రాజ్యసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించడం ఇదే తొలిసారి. ఆమె తన ప్రసంగంలో అమృత్‌కాల్ గురించి ప్రస్తావించారు. ‘2047 కల్లా దేశం సువర్ణ అధ్యాయాలను లిఖిస్తుంది. మనం దేశాన్ని ‘ఆత్మనిర్భర్’ గా నిర్మించుకున్నాం, దేశ ప్రజల అభివృద్ధి, రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్భయంగా వ్యవహరిస్తోంది, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది’ అన్నారు.

‘75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు పూర్తి చేసుకున్నాం, కొన్ని నెలల క్రితమే అమృత్ మహోత్సవాలు నిర్వహించుకున్నాం. 2047నాటికల్లా దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్‌గా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. పేదరికంలేని భారత్ నిర్మాణం కోసం కృషి జరుగుతోంది. పౌరులందరి అభివృద్ధే లక్షంగా ప్రభుత్వం పనిచేస్తోంది’ అన్నారు.

డిజిటల్ ఇండియా దిశగా భారత్ ముందుకెళ్తోందని, నూతన సాంకేతికత ఆధారంగా పౌరులకు సేవలు అందుతున్నాయని, నూతన ఆవిష్కరణలు జరుగుతున్నాయని, భారత డిజిటల్ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శంగా మారిందన్నారు. మూడు కోట్ల మందికి సొంతిళ్లు నిర్మించామన్నారు. ఉచిత బియ్యం నిరుపేదలకు అందిస్తు న్నామన్నారు. తొలిసారి దేశంలో పురుషుల కన్నా మహిళా సంఖ్య పెరిగిందన్నారు. మహిళా సాధికారతను ప్రోత్సాహిస్తున్నామన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అవలంబిస్తున్న కఠిన వైఖరిని ప్రపంచం ఇప్పుడు అర్థం చేసుకుంటోందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ రైల్వే నెట్‌వర్క్‌గా భారత రైల్వే అడుగులేస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News