Monday, December 23, 2024

ఇది నిజంగా గర్వించదగ్గ క్షణం: రాష్ట్రపతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చంద్రయాన్3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి ఓణాల్లో జీవితకాలంలో ఒక్కసారే సంభవిస్తాయని, ఇది నిజంగా గర్వించదగ్గ సందర్భమని ఆమె ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. దేశం యావత్తు గర్వించేలా చేసిన మధుర క్షణమిదన్నారు. గోవాలో అధికార పర్యటనలో ఉన్న రాష్ట్రపతి విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగడాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించిన అనంతరం ఇస్రో బృందానికి వీడియో సందేశం ద్వారా తన అభినందనలు తెలియజేశారు.

‘చరిత్ర సృష్టించిన రోజులు ఉన్నాయి. చంద్రయాన్ మిషన్‌ను విజయవంతం చేయడం ద్వారా మన శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించడమే కాకుండా భౌగోళిక స్వరూపాన్నే తిరగరాశారు. ఇది నిజంగా గర్వించదగ్గ క్షణం’ అని రాష్ట్రపతి అన్నారు. ‘భారత దేశం గర్వించేలా చేసే ఇలాంటి ఘటనలు జీవితంలో ఒకసారే సంభవిస్తాయి. ఇస్రోను ఈ మిషన్‌లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News