Sunday, December 22, 2024

కోటి దీపోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. రాష్ట్రపతికి కోటి దీపోత్సవం నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. వారితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి సీతక్క కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీప ప్రజ్వలన చేయనున్నారు. కోటి దీపోత్సవంలో పూరీ జగన్నాథునికి రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి రాష్ట్రపతి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలి కార్తీక దీపాన్ని రాష్ట్రపతి వెలిగించారు.

ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన సిఎ రేవంత్‌రెడ్డి
బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు. అలాగే బిజెపి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రపతికి పూల గుచ్ఛం అందించి, స్వాగతం పలికారు.

రాత్రికి రాజ్ భవన్‌లోనే బస
రాత్రికి రాజ్ భవన్‌లో రాష్ట్రపతి బస చేయనున్నారు. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్ మంథన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అంతర్జాతీ య జానపద కళారూపాల ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం శుక్రవారం మధ్యాహ్నం తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళతారని రాష్ట్రపతి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News