Friday, January 10, 2025

ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము

- Advertisement -
- Advertisement -

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 27 మందికి శుక్రవారం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును ప్రదానం చేశారు. 18వ ప్రవాసీ భారతీయ దివస్(పిబిడి) సదస్సు ముగింపు సందర్భంగా ఆమె ఈ అవార్డులను ప్రదానం చేశారు. సమాజం కోసం వివిధ రంగాల్లో పనిచేస్తున్న అవార్డు గ్రహీతలను ముర్ము అభినందించారు. అవార్డు గ్రహీతలలో ఒకరైన ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షులు క్రిస్టీన్ కార్లా కంగాలూకు ఆమె ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విదేశాల్లో ఉన్న భారతీయులకు ప్రదానం చేసే అత్యున్నత అవార్డు ‘ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవారు’్డ. పబ్లిక్ అఫైర్స్ కేటగిరిలో కాంగాలూకు ఈ అవార్డు దక్కింది.

ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షులు కూడా ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అవార్డులు పొందిన ఇతరులలో అజయ్ రాణే(ఆస్ట్రేలియా, కమ్యూనిటీ సర్వీస్), మరియాలేనా జోన్ ఫెర్నాండెజ్(ఆస్ట్రియా, విద్య), స్వామి సంయుక్తానంద(ఫిజీ, కమ్యూనిటీ సర్వీస్), సరస్వతీ విద్యా నికేతన్(గయానా, కమ్యూనిటీ సర్వీస్), లేఖ్ రాజ్ జునేజా(జపాన్, సైన్స్ అండ్ టెక్నాలజీ), ప్రేమ్ కుమార్(కిర్గీజ్ రిపబ్లిక్, మెడికల్ సైన్స్), సౌక్తవీ చౌదరి(లావోస్, బిజినెస్) ఉన్నారు. భారత ఉపరాష్ట్రపతి చైర్మన్‌గా, విదేశీ వ్యవహారాల మంత్రి వైస్‌చైర్మన్‌గా ఉన్న కమిటీ ఈ అవార్డు గ్రహీతలను ఎంపికచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News