Sunday, January 5, 2025

పోచంపల్లి అభివృద్ధికి కృషి చేస్తా: రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము

- Advertisement -
- Advertisement -

భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీ, చేనేత మగ్గాలను పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోచంపల్లి చేనేత కార్మికులను చూసిన తర్వాత ఆనందం కలిగిందని రాష్ట్రపతి అన్నారు. చేనేత కళ విభిన్నమైందని తెలిపారు. ఫ్యాషన్ డిజైన్ రంగంలో పోచంపల్లి చేనేత కార్మికుల కృషి అభినందనీయం అన్నారు. చేనేత కళను భావితరాలకు అందించడం కోసం మీరు చేస్తున్న కృషిని మెచ్చుకున్నారు. పోచంపల్లి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News