Friday, November 22, 2024

లోక్‌సభ రాజ్యసభ ప్రోరోగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లోక్‌సభ , రాజ్యసభల ప్రోరోగ్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ బుధవారం ఆదేశాలు వెలువరించారు. ఉభయ సభలు మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం తరువాత నిరవధిక వాయిదా పడ్డాయి. ఇప్పుడు రాష్ట్రపతి ఉభయసభలను ప్రోరోగ్ చేశారని పార్లమెంటరీ వర్గాలు ఓ బులెటిన్ వెలువరించాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18 నుంచి 21 వరకూ సాగాయి. ఈ సెషన్‌లోనే పార్లమెంట్ కొత్త భవనంలోకి మారాయి. ఈ నెల 20న లోక్‌సభలో మహిళా బిల్లు ఆమోదం పొందింది. మరుసటి రోజు 21వ తేదీన రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News