Sunday, December 22, 2024

నేడు రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం నగరంలో పర్యటించనున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట పరిధిలోని నల్సార్ లా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరవుతున్నారు. గౌరవ అతిథులుగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, నల్సార్ ఛాన్సలర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నర్సింహులు హాజరవుతారని యూనివర్సిటీ విసి కృష్ణదేవరావు వెల్లడించారు. ఈ నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీసు, రెవెన్యూ, ఆర్‌అండ్‌బి, వైద్య, ఆరోగ్యశాఖ, అగ్నిమా పక, అటవీ, విద్యుత్ తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్షించారు.

రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు, బందోబస్తును పర్యవేక్షించాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన 8 స్టేట్ స్టాల్స్, 4 ఫుడ్ కోర్టులు, మీడి యా సెంటర్ తదితర స్టాళ్లను పరిశీలించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ అదనపు సిపి విశ్వప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి బేగంపేట, హెచ్‌పి ఎస్, పిఎన్‌టి జంక్షన్, రసూల్‌పురా, సిటిఒ, ప్లాజా, టివోలి, కార్ఖానా, తిరుమలగిరి, లోత్‌కుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News