న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 3 నుంచి 7 వరకు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా రెండు కాన్వొకేషన్లలో పాల్గొనమే కాక, అణగారిన గిరిజన తెగల ప్రతినిధులతో మమేకమవుతారు. సోమవారం కర్ణాటక లోని ముద్దనెహళ్లి శ్రీసత్యసాయి యూనివర్శిటీ రెండో కాన్వొకేషన్‌లో పాల్గొంటారు. సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ముఖ్యంగా గిరిజన తెగల ప్రతినిధులతో కలుసుకుంటారు.
ఈనెల 4న హైదరాబాద్ లోని అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి వార్షిక వేడుకల ముగింపు సభలో పాల్గొంటారు. బుధవారం గొండ్వానా యూనివర్శిటీ 10 వ కాన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. నాగపూర్‌లో కొరడి లో భారతీయ విద్యాభవన్‌కు చెందిన సాంస్కృతిక్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. జులై 6 న నాగపూర్ రాజ్‌భవన్‌లో పివిటిజి కి చెందిన సభ్యులతో మమేక మవుతారు.. ముంబై లోని రాజ్‌భవన్‌లో పౌర సన్మాన కార్యక్రమానికి హాజరవుతారు.