Monday, December 23, 2024

పంజాబ్, తెలంగాణ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 4000 ఎకరాలకు పైగా భూమిని ఆక్రమించిన 11200 మందికిపైగా కౌలుదారులకు తగిన పరిహారం చెల్లించి, ఆస్తి హక్కులు కల్పించే ఉద్దేశ్యంతో రూపొందించిన పంజాబ్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించిందని అధికారులు గురువారం తెలిపారు. ఇంతేకాక కోర్టు నిర్ణయించిన తేదీలో నిందితులను హాజరుపరచడంలో విఫలమైతే, తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో బెయిల్ పొందేందుకు ష్యూరిటీ ఉన్న వ్యక్తులపై జరిమానా విధించడానికి అనుమతించే తెలంగాణ బిల్లుకు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.

పంజాబ్ భోండేదార్, బుటెమార్, దోహ్లిదార్, ఇన్సార్ మియాడి, ముకర్రారిదార్, ముంధిమార్, పనాహి ఖదీమ్, సౌంజిదార్ లేదా తరద్దద్కర్(యాజమాన్యం హక్కులు) బిల్లు 2020ని నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పంజాబ్ అసెంబ్లీ ఆమోదించిందని ఓ అధికారి తెలిపారు. ఆ చట్టాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఆమోదించింది. దీంతో 4000 ఎకరాల భూమిని ఆక్రమించిన 11200 కంటే ఎక్కువ మంది కౌలుదారులకు తగిన పరిహారం చెల్లించిన తర్వాత ఆస్తి హక్కులను అనుమతిస్తుంది. సమాజంలోని ఆర్థికంగా, సామాజికంగా బలహీనవర్గాలకు చెందిన వారు, ఎక్కువగా సాగు చేసుకునేవారికి ఈ చట్టం సాధికారత కల్పిస్తుందని మరో అధికారి తెలిపారు.

ఈ కౌలుదారులు చాలా సంవత్సరాలుగా చిన్నచిన్న భూములు ఆక్రమించుకుని తరతరాలుగా వారి హక్కులను వారసత్వంగా పొందుతున్నారు. అయినప్పటికీ వారు నమోదిత యజమానులు కానందున, వారు ఆర్థిక సంస్థల నుంచి పొందలేరు, ఏదైనా ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు ఉపశమనం కూడా పొందలేకపోతున్నారు. ఇకపై వారు ఇతర భూయజమానుల వలె అన్ని ప్రయోజనాలను పొందుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News