నాగ్‌పూర్ ఐఐఎం క్యాంపస్ ఆవిష్కరణలో రాష్ట్రపతి
నాగ్‌పూర్ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ ఆదివారం స్థానిక ఇండియన్ ఇనిస్టూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) నూతన క్యాంపస్‌ను ఆవిష్కరించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ ప్రఖ్యాత విద్యాసంస్థ ఉంది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఆహుతులను ఉద్ధేశించి రాష్ట్రపతి మాట్లాడారు. ఐఐఎంనాగ్‌పూర్ పర్యావరణం, క్యాంపస్ ప్రాంతపు వాతావరణం విద్యార్థుల మానసిక ఆహ్లాదానికి ప్రశాంతతకు వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు. విద్యార్థులు తమ ప్రతిభను మరింతగా తీర్చిదిద్దుకోవడానికి అవసరం అయిన మేధోశక్తిని ఇటువంటి సానుకూలత కల్పిస్తుంది. విద్యార్థులు డిగ్రీల తరువాత ఉద్యోగార్థులు బదులుగా ఉద్యోగ ప్రదాతలు అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. సముచిత వాతావరణంలో విద్యార్థులకు సరైన విద్యాబోధన అవకాశాలు ఏర్పడుతాయని తెలిపారు. ఈ సభలో కేంద్ర రాహదారులు హైవేల మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మహారాష్ట్ర మంత్రులు ఇతరులు పాల్గొన్నారు.