- Advertisement -
వాషింగ్టన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ అంత్యక్రియలకు తాను హాజరవుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. 70 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా బ్రిటన్ రాణిగా కొనసాగిన ఎలిజబెత్ గురువారం స్కాట్‌ల్యాండ్‌లోని బాల్మోరా ప్రాసాదంలో తన 96వ ఏట కన్నుమూశారు. అంత్యక్రియల తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ 1953లో బ్రిటన్ రాణిగా ఎలిజబెత్ బాధ్యతలు చేపట్టిన వెస్ట్‌మినిస్టర్ అబ్బే చర్చిలోనే సెప్టెంబర్ 19న ఆమె అంత్యక్రియలు జరగవచ్చని తెలుస్తోంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయో తనకు వివరాలు ఇంకా తెలియనప్పటికీ తాను మాత్రం వెళుతున్నానని ఓహియోలోని కొలంబస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విలేకరులకు బైడెన్ శనివారం తెలిపారు. బ్రిటన్ రాజుగా బాధ్యతలు చేపట్టిన చార్లెస్‌తో తాను ఇంకా మాట్లాడలేదని మరో ప్రశ్నకు జవాబుగా ఆయన తెలిపారు.
- Advertisement -