Saturday, November 23, 2024

ప్రజాస్వామ్యంతో ఉజ్వలంగా ఎదగండి: రాష్ట్రపతి పిలుపు

- Advertisement -
- Advertisement -

President Kovind attend to Convocation of Kashmir University

శ్రీనగర్: కశ్మీరుకు చెందిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రభావం యావత్ భారతదేశం మీద చెరగని ముద్ర వేసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. మంగళవారం ప్రఖ్యాత డాల్ సరస్సు ఎదురుగా ఉన్న ఎస్‌కెఐసిసి ఆడిటోరియంలో కశ్మీరు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి కోవింద్ మిమల్నందరినీ ఈ విధంగా కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ కశ్మీరీ భాషలో కశ్మీరు ప్రజలను ఉద్దేశిస్తూ తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు. కశ్మీరుకు వచ్చిన అన్ని మతాలు సనాతనవాదాన్ని వీడి, పరస్పర గౌరవాన్ని ప్రోత్సహించిన కశ్మీరియత్ అనే విశిష్ట సిద్ధాంతాన్ని పొందుపరచుకున్నాయని రాష్ట్రపతి అన్నారు. తమ ప్రాంత ఘన చారిత్రక వైభవాన్ని గురించి అవగతం చేసుకోవలసిందిగా ఆయన కశ్మీరీ యువజనులకు పిలుపునిచ్చారు. మిగిలిన భారత్‌కు కశ్మీర్ మొదటి నుంచి ఒక ఆశాదీపంలా ఉందన్న విషయాన్ని కశ్మీరీ యువత తెలుసుకోవాలని ఆయన అన్నారు. కశ్మీరీ యువజనులు, మహిళలు శాంతియుత, ఉజ్వల భవిష్యత్తు నిర్మాణం కోసం ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకోగలరన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

President Kovind attend to Convocation of Kashmir University

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News