రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్
లఖ్నో: రాముడు లేకుండా అయోధ్య లేదని రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ అన్నారు. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ అయోధ్య ఉంటుందని ఆయన అన్నారు. అయోధ్యలో ఆదివారం రామాయణ కాంక్లేవ్‌ను ప్రారంభించిన సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగించారు. తన పేరును గుర్తు చేస్తూ రాముడంటే ఆరాధన, గౌరవం ఉండటం వల్లే తన కుటుంబం తనకు ఆ పేరు పెట్టిందని, ప్రజలందరిలోనూ అదే భావన ఉన్నదని రాష్ట్రపతి అన్నారు. అయోధ్య అంటే యుద్ధం ద్వారా ఎవరూ జయించలేనిదని రాష్ట్రపతి అర్థ వివరణ ఇచ్చారు. రఘువంశానికి చెందిన రఘు,దిలీప్,అజ్,దశరథుడు, రాముడు సాహసవంతులని, అందుకే వారు అయోధ్య రాజధానిగా పరిపాలన చేశారని రాష్ట్రపతి అన్నారు. వనవాస కాలంలో రాముడు గిరిజనులు, వానరులతో సైన్యాన్ని నిర్మించారని, గిరిజనుల పట్ల ఆయనకు ఎంతో ప్రేమ, స్నేహభావం ఉండేవని రాష్ట్రపతి అన్నారు. రామజన్మభూమి ఆలయ నిర్మాణ ప్రాంతాన్ని కూడా రాష్ట్రపతి సందర్శించనున్నారు. కాంక్లేవ్ ప్రారంభోత్సవంలో ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్‌పటేల్, ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్, కేంద్రమంత్రి దర్శనవిక్రమ్‌జర్దోశ్ పాల్గొన్నారు.