Friday, November 22, 2024

సవాళ్ల నడుమ సమర్థత చాటుకున్న భారత్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సందేశం
కొవిడ్‌పై విజయంతో ప్రపంచానికి స్ఫూర్తి
ప్రజాస్వామ్య పటిష్టతకు సర్వత్రా గుర్తింపు
న్యూఢిల్లీ: ప్రపంచ స్థాయిలో పలు దశల కాలపరీక్షల నడుమ భారతదేశం సాధించిన ఘనతలు ఎనలేనివని నూతన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ తెలిపారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవం నే పథ్యంలో రాష్ట్రపతి జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు. ప్రపం చం అంతా కోవిడ్ కల్లోలంతో సతమతమయిన దశలో భారతదేశం ఈ వైరస్ సంక్షోభాన్ని ధృఢసంకల్పంతో ఎదుర్కొని, ఇందులో విజయం సాధించిందని తెలిపారు. ప్రజాస్వామ్యపు నిజమైన సమర్థత, ప్రాధాన్యతల గురించి కనుగొనేందుకు భారతదేశం ప్రపంచానికి తన తోడ్పాటు అందించింది. ఈ ప్రక్రియ ప్రాధాన్యతతో పటిష్టతతో ఇతర దేశాల అన్వేషణకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. దేశ జనులకు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, తొలిసారిగా దేశ జనులను ఉద్ధేశించి ఆమె ప్రసారసాధనాల ద్వారా ప్రసంగించారు. అణగారిన వర్గాలు, బడుగు, వెనుకబడిన వర్గాలకు భరోసా కల్పించగలిగారు. ఈ కోణంలో భారతదేశ ఖ్యాతి మరింతి ఇనుమడించిందని అన్నారు. ఆర్థిక సంస్కరణలు కీలక దశలో ఉన్నా యి. ప్రధాన ఆర్థిక సంస్కరణల చర్యలు సృజనాత్మక సంక్షేమ పథకాలు, చొరవలతో సాగుతున్నాయని, కోవిడ్ 19 తరువాతి దశలో ఇండియా ఇటీవలి దశలో సరికొత్త శక్తిగా మారుతోందని అన్నారు. భారతదేశంలో ప్రజాస్వామిక ప్రక్రియ సంబంధిత వ్యవస్థలు కలకాలం నిలుస్తాయా? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. రాజ్యాంగాల నిపుణులకు కూడా సందేహాలు కలిగాయి.

అయితే వీటిని భారతీయులు తుత్తునియలు చేశారని ప్రశంసించారు. అనుమానాలు తప్పులని తేల్చివేశారని తెలిపారు. ప్రాంతీయ అసమానతలు తగ్గి, ప్రగతి సార్వత్రిక అయిందని అన్నారు. రాష్ట్రపతి 17 నిమిషాల పాటు తమ ప్రసంగం సాగించారు. ప్రత్యేకించి ఇటీవలి కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భారతదేశం కనబర్చిన సమర్థత, సాధించిన విజయం సర్వత్రా ప్రశంసలకు దారితీసిందని తెలిపారు. మానవ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా మనం వ్యాక్సినేషన్ల ప్రక్రియను చేపట్టామని, కేవలం దేశీయ ఉత్పత్తి టీకాలతోనే సంపూర్ణ వ్యాక్సినేషన్ దశకు చేరుకుంటున్నామని అన్నారు. గత నెలలో మొత్తం మీద దేశం 200 కోట్ల వ్యాక్సినేషన్ మైలురాయిని దాటిందని గుర్తుచేశారు. ఓ మహత్తరమైన భారతదేశ నిర్మాణం సార్థకం అయితేనే మన ప్రయాణాలకు పూర్తిస్థాయి సార్థకత ఏర్పడుతుందని తేల్చిచెప్పారు. ఈ దశలో కన్నడ కవి కువెంపు కవితలోని మాటలను ఉటంకించారు.‘ నేను వెళ్లిపోతాను…మీరూ తప్పదు ..అయితే మట్టి లో కలిసిపోయే మన ఎముకలతో సరికొత్త భారత ఘట్టపు మహా అధ్యాయం మొలుస్తుంది’ అని అప్పట్లో ఆ కవి ఇచ్చిన పిలుపు ఆ తరువాత దేశ విముక్తి కోసం త్యాగాలు చేసేందుకు స్ఫూర్తిగా నిలిచిందని రాష్ట్రపతి గుర్తు చేశారు. దేశంలో లింగ అసమానతలు తగ్గుతున్నాయని, పలు రంగాలలో మహిళలు ముందుకు దూసుకువెళ్లుతున్నారని తెలిపారు.

President Murmu Address to the Nation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News