Wednesday, January 22, 2025

12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారీ కుదుపులతో కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఏకంగా 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. పలుస్థాయిల తర్జనభర్జనలు, అంతర్గత విశ్లేషణల నడుమ కేంద్రం గవర్నర్ల పదవులకు పేర్లు సిఫార్సు చేయడం, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ఈ జాబితాకు ఆమోద ముద్రవేయడంతో 12 రాష్ట్రాలకు కొత్త రాజ్యపాలకులు నియమితులు అయ్యారు. కాగా అత్యంత కీలకమైన సరిహద్దు ప్రాంతం లద్థాఖ్‌కు కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ నియామకంజరిగింది. ఎనమండుగురు వరకూ గవర్నర్లకు స్థానచలనం జరగగా. నలుగురు కొత్త వారిని గవర్నర్లుగా తీసుకున్నారు. దీనిని భారీ ప్రక్షాళనగా, పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంవత్సరం దశలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక చర్యగా భావిస్తున్నారు.

ఆదివారం నియమితులు అయిన గవర్నర్ల జాబితా వివరాలు 1) ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఎస్ అబ్దుల్ నజీర్ నియమితులు అయ్యారు. ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి. 2) అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా లెఫ్టినెంట్ జనరల్ త్రివిక్రమ్ పర్నాయక్ నియమితులు అయ్యారు. 3) సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య . 4) సిపి రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్ అయ్యారు. 5)హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియమితులు అయ్యారు. 5) అసోం గవర్నర్‌గా గులాబ్ చంద్ కటారియా నియుక్తులు అయ్యారు. 6) ఛత్తీస్‌గఢ్ కొత్త గవర్నర్‌గా బిశ్వా భూషణ్ హరిచందన్ నియమితులు అయ్యారు. ఇప్పటివరకూ హరిచందన్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నారు. 7) మణిపూర్ గవర్నర్‌గా సుశ్రీ అనూసూయియా ఉయిక్యి నియమితులు అయ్యారు. ఆమె ఇప్పటివరకూ ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా ఉన్నారు. 8) ఇప్పటివరకూ మణిపూర్ గవర్నర్‌గా ఉన్న ఎల్‌ఎ గణేశన్ నాగాలాండ్ గవర్నర్ అయ్యారు. 9) ఇప్పటివరకూ బీహార్‌కు గవర్నర్‌గా ఉన్న ఫగూ చౌహాన్ ఇక మేఘాలయా గవర్నర్ అవుతున్నారు.

10) ఇప్పటివరకూ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ బీహార్ గవర్నర్‌గా నియమితులు అయ్యారు. 11) ఇప్పటివరకూ జార్ఖండ్ గవర్నర్‌గా ఉన్న రమేష్ బియాస్ మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులు అయ్యారు. 12) ఇప్పటివరకూ అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న బ్రిగేడియర్ డాక్టర్ బిడి మిశ్రా (రిటైర్డ్) లద్ధాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమతులు అయ్యారు. ఇప్పటివరకూ లద్ధాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న ఆర్‌కె మాథూర్ స్థానంలో మిశ్రా నియామకం జరిగింది. రాష్ట్రాలలో గవర్నర్ల మార్పిడి, కొత్త నియామకాలు, ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న భగత్ సింగ్ కోష్యారీ, లద్ధాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్‌కె మాథూర్ రాజీనామాలు, వీటికి రాష్ట్రపతి ఆమోదం తదితర వివరాలతో రాష్ట్రపతి భవన్ నుంచి ఆదివారం అధికారిక ప్రకటన వెలువడింది. ఇప్పుడు కొత్త గవర్నర్లుగా కేంద్రం ఎంపిక చేసిన వారిలో లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, సిపి రాధాకృష్ణన్, శివప్రతాప్ శుక్లా, గులాబ్ చంద్ కటారియాలు ఉన్నారు. ఇప్పటి నియామకాలలో నలుగురు బిజెపి నేతలకు స్థానం దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News