ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో క్లాస్ రూమ్ ల నిర్మాణానికి సంబంధించిన1,300 కోట్ల రూపాయల కుంభకోణంలో ఆమ్ ఆద్మీపార్టీ నాయకులు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లపై ఎఫ్‌ఐ ఆర్ నమోదుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చారు. 2022 లో ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ డైరెక్టరేట్ ఈ కుంభకోణం లో వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు నకు సిఫార్సు చేసింది. అనంతరం ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక సమర్పించింది.అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మనీశ్ సిసోడియా,
సత్యేంద్ర జైన్ మంత్రులుగా ఉన్నారు. ఆ సమయంలోనే ఈ కుంభకోణం జరిగింది.సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ 2020 ఫిబ్రవరి 17 తరగతి గదుల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై నివేదిక సమర్పించింది. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో పబ్లిక్ వర్క్స్ శాఖ మొత్తం 2,400 తరగతి గదుల నిర్మాణం లో స్పష్టంగా అవకతవకలు జరిగినట్లు నివేదికలో స్పష్టం చేశారు. ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన తర్వాత సిసోడియా, జైన్ లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచే అవకాశం ఉంది.