Monday, December 23, 2024

ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ముర్ము

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్రమోడీ 73 వ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు, పలువురు ప్రముఖులు , ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం నుంచి అక్టోబర్2 వరకు సేవా పక్షోత్సవాలను బీజేపీ నిర్వహించనున్నది. “ ప్రధాని మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన దూరదృష్టి, బలమైన నాయకత్వంతో ప్రతిరంగంలో దేశాభివృద్ధికి మరింత కృషి చేయాలని కోరుకుంటున్నాను” అని రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేశారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆధునిక నవ భారత వాస్తుశిల్పిగా మోడీని అభివర్ణించారు. దేశ ప్రాచీన వారసత్వ ఆధారంగా దేశ స్వయం సామర్థానికి గట్టి పునాది వేశారని ప్రశంసించారు.

ప్రధాని మోడీ భారతీయ సంస్కృతుల ప్రపంచ ప్రతిష్టకు స్పష్టమైన రూపం ఇచ్చారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పేర్కొన్నారు. దేశానికి కేవలం కొత్తగా గుర్తింపు తీసుకురావడమే కాకుండా, దేశ ప్రతిష్టను ప్రపంచానికి విస్తరింప చేశారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. చక్కని ఆరోగ్యంతో సుదీర్ఘజీవితాన్ని సాగించాలని కోరుకుంటున్నానని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, నితీష్‌కుమార్, సిద్ధరామయ్య, శివాజీ సింగ్ చౌహాన్, ట్విటర్ (ఎక్స్) ద్వారా ప్రధానికి శుభాకాంక్షలు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News