Monday, January 20, 2025

రక్షాబంధన్‌ ‌శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలకు చిహ్నమైన రక్షాబంధన్ సమాజంలో అభిమానం, నమ్మకం, సామరస్యం మరింత పెంపొందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మంగళవారం రక్షాబంధన్‌ సందర్భంగా రాష్ట్రపతి తన సందేశంలో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “ ఈరోజు చెల్లెళ్లు తమ అన్నలకు రాఖీ కడతారని, వారు సంతోషంగా, వైభవంగా, మంచి ఆరోగ్యంగా ఉండాలని అభిలషిస్తారని పేర్కొన్నారు. సమాజంలో మన సోదరీమణులను, కుమార్తెలను సంరక్షిస్తూ తద్వారా మనదేశ విజయాలను రక్షించాలని ఈ రక్షాబంధన్ వేడుక పరమార్థమని ముర్ము వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News