Monday, December 23, 2024

రాష్ట్రపతి బంగారపు ఆతిథ్యం జి20 నేతలకు ఆహ్లాదకర డిన్నర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జి20 సదస్సుకు విచ్చేసిన విదేశీ అతిధులు, ఇతర నేతలకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ శనివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. సదస్సు ప్రధాన వేదిక భారతీయ మండపంలో ప్రధాని మోడీతో కలిసి రాష్ట్రపతి అక్కడికి ఒక్కొక్కరుగా చేరుకున్న ప్రముఖులకు స్వాగతం పలికారు. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో నలందా విశ్వవిద్యాయం చిత్రం ఉంచారు. తనకు ఈ విందు మరిమరీ ప్రత్యేకం అని భార్య అక్షత మూర్తితో కలిసి డిన్నర్ వేదిక వద్దకు వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రధాని మోడీతో చమత్కరించారు. జి20 సదస్సు తొలి సెషన్ తరువాత ఢిల్లీ డిక్లరేషన్ వెలువడింది. తరువాత రెండో సదస్సు మధ్యలో విరామంగా రాష్ట్రపతి విందు జరిగింది. దీనికి ప్రముఖులు చేరుకున్నారు. విందులో అతిధులకు వెండి, బంగారు పాత్రలలో వడ్డన ఏర్పాట్లు చేశారు. రాజస్థానీ కళాకారులు రూపొందించిన ఫర్నిచర్‌పై అమర్చిన వెండిగ్లాసులు స్పూన్లను కూడా ప్రత్యేకంగా తయారు చేయించారు.

విందులో శాకాహారం వాడారు. పలు తృణధాన్యాలతో కూడిన వంటకాలు, కశ్మీరీ కావా, ఫిల్టర్ కాఫీ, డార్జిలింగ్ టీ వంటివి, భారతీయ తీపి వంటకాలకు ప్రత్యేకమైన జిలేబీ, గులాబ్‌జామ్, రసగుల్లాలు, రసమలైలు ప్రత్యేకంగా నిలిచాయి. సపండుతో చేసిన గాలెట్టి బ్రెడ్ వంటి వంటకం, గ్లెజ్డ్ ఫారెస్టు మష్రూమ్, కేరళ రెడ్‌రైస్, వివిధ రకాల బ్రెడ్‌లతో పాటు ప్రఖ్యాత బొంబా యి పావ్ బాజీ కూడా సమకూర్చారు. యాలకులు, ఊ డలతో చేసిన మధురిమ వంటకం, ఫిగ్ పీచ్, అంబే మె హార్, క్రిస్పిన్, పాలు గోధుమలతో కూడిన నట్స్ వంటివి వడ్డించారు. నేపథ్యంలో సుమధుర భారతీయ సంగీతం విన్పించారు. వచ్చిన వారందరికి రాష్ట్రపతి స్వాగతం పలకగా, అధికారులు వీరిని వారి సీట్ల వద్దకు తోడ్కోని వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News