Sunday, December 22, 2024

తొట్టతొలి దేశీయ క్యాన్సర్ థెరపీ

- Advertisement -
- Advertisement -

దేశంలో తొలిసారిగా రూపొందిన క్యాన్సర్ చికిత్స కార్ టి సెల్ థెరపీని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ గురువారం అధికారికంగా మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా జరిగే పోరులో , మానవాళికి సరికొత్త ఆశను నమ్మికను కల్పించే క్రమంలో ఇదో మైలురాయి అవుతుందని తెలిపారు. ఇక్కడి పొవాయ్‌లోని ఐఐటి బొంబాయిలో ఈ థెరపీ విడుదల కార్యక్రమం జరిగింది. మేకిన్ ఇండియా ఉద్యమస్ఫూర్తికి ఈ థెరపీ ఓ ప్రతీక అవుతుందని రాష్ట్రపతి తెలిపారు. ఐఐటి బొంబాయి, టాటా మెమొరియల్ సెంటర్ కలిసి ఈ జన్యు ప్రాతిపదిక థెరపీని రూపొందించాయి.

క్యాన్సర్ చికిత్స ప్రక్రియలో ఇది తక్కువ వ్యయ ప్రక్రియ కూడా అవుతుంది. యావత్తూ మానవాళికి ఈ ఔషధ చికిత్స ప్రక్రియ మేలు చేస్తుందని రాష్ట్రపతి తెలిపారు. కార్యక్రమంలో టాటా సంస్థ డైరెక్టర్ సుదీప్ గుప్తా, ఐఐటి బొంబాయి డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాసిస్ చౌదరి కూడా మాట్లాడారు. అయితే ఈ థెరపీ దేశంలో అందరికీ అందుబాటు ధరల్లో లభ్యం కావడం అనేది ఇప్పట్లో సాధ్యం కాదని దీని నిర్మాతలు తెలిపారు. కోట్ల రూపాయలలో దీనిని పొందేందుకు వీలుంటుంది. అయితే క్రమేపీ ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటే ఇది క్యాన్సర్ చికిత్సలో కీలకం అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News