Sunday, December 22, 2024

ఎఐతో న్యాయవ్యవస్థకు మెరుగులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సాంకేతికంగా ఎన్నో మార్పులు వ స్తున్నాయని, న్యాయ వ్యవస్థ కూడా కృత్రిమ మేధను మరింత ఉ పయోగించుకొని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ధనికుడితో పోలిస్తే పేద లు న్యాయం పొందడం లేదని, మెరుగైన సమాజం కోసం ఈ వి ధానంలో మార్పు రావాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. స్వాతం త్య్ర పోరాటంలో గాంధీజీ న్యాయబద్ధంగా సత్యాగ్రహ దీక్ష చే సి, ఆదర్శంగా నిలిచారని వ్యాఖ్యానించారు. నల్సార్ న్యాయ వి శ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యఅతిథిగా హాజరుకాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ, గవర్నర్ జిష్ణదేవ్ వర్మ, ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, రా ష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, నల్సార్ యూ నివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరాయ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్.వాసంతి, న్యాయమూర్తులు, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, సిఎస్ శాంతికుమారి, డిజిపి జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, నిబద్ధత, పారదర్శకంగా పనిచేస్తే న్యాయవాద వృత్తిలో ఎంతో ఎత్తుకు ఎదగొచ్చని తెలిపారు. అంతర్జాతీయ న్యాయం నేపథ్యంలో వివిధ వివాదాలకు సంబంధించి కక్షిదారులపై అవగాహన దిశగా న్యాయ నిపుణులు, న్యాయమూర్తు లు అల్గారిథమ్ అంశాలతో కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అందువల్ల న్యాయ విద్యలో ఉత్తీర్ణులైన వి ద్యార్థులంతా భవిష్యత్ న్యాయ నిపుణులుగా ఎదగడంలో నానాటికీ విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకోవడానికి సిద్ధం కావాలని చెప్పారు. భారత్ వంటి దేశానికి ఘన చరిత్ర మన జాతీయ ప్రతిష్టను, ఆకాంక్షలను సగర్వంగా ముం దుకు తెస్తుందని, రాజ్యాంగ సభలో తన తుది ప్రసంగం సందర్భంగా ప్రాచీన భారత ప్రజాస్వామ్య సంప్రదాయాలు, పద్ధతులను డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్పష్టం చేశారని తెలిపారు. భారత రాజ్యాంగంలో మన స్వాతంత్య్ర పోరాట ఆదర్శాలు- న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్రాలను పొందుపరిచారని పేర్కొన్నారు. ముఖ్యంగా పీఠిక, ప్రాథమిక హక్కులలో పొందుపరచిన సమానత్వానికి సంబంధిత ఆదర్శం, న్యాయ ప్రదానంలో ప్రభుత్వ విధానాన్ని నిర్దేశించే ఆదేశిక సూత్రాలలోనూ ప్రతిబింబిస్తుందని తెలిపారు.

అందరికీ సమాన న్యాయ ప్రదానం అని, ఉచిత న్యాయ సహాయం అందాలని ఈ సూత్రాల్లో ఒకటి అని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం అందించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను నల్సార్ విశ్వవిద్యాలయ దార్శనిక పత్రం కూడా స్పష్టం చేస్తోందని చె ప్పారు. కానీ, సంపన్నులకు లభించే న్యాయం నిరుపేదలకు ల భించకపోవడం దురదృష్టకరమని, ఈ పరిస్థితిలో మార్పు రావాలని పేర్కొన్నారు. ఈ మార్పు తేవడంలో ఈతరం న్యాయ నిపుణులు వైతాళికులు కావాలని ఆకాంక్షించారు. నల్సార్ విశ్వవిద్యాలయం జంతు సంరక్షణ చటాల గురించి చేస్తున్న కృషిని రా ష్ట్రపతి ప్రస్తావించారు. ఒడిశా ప్రభుత్వంలో తాను మత్స్యశాఖ, జంతు వనరుల అభివృద్ధి మంత్రిగా పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. కౌటిల్యుని అర్థశాస్త్రంలో, ప్రాచీన భారత్‌దేశంలో చట్టపరమైన పరిపాలనా వివరణ ఉన్నదని తెలిపారు.

రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాలు
నల్సార్ నుంచి పిహెచ్‌డీ, ఎల్‌ఎల్‌ఎంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్రపతి బంగారు పతకాలు అందజేశారు అ లాగే నల్సార్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్, హైకోర్టు సిజె జస్టిస్ అలోక్ ఆరాధే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్. నరసింహ డిగ్రీ, పిజి, పిహెచ్‌డి పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాద డిగ్రీ పట్టాలు పొందిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. బం గారు పతకాల అందుకున్న వారిలో బాలురు కంటే బాలికలు ఎ క్కువ సంఖ్యలో ఉండటం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు.

రాష్ట్రపతికి సిఎం ఘన స్వాగతం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సి ఎం రేవంత్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి, మంత్రులు పొన్నం, సీత క్క, హైదరాబాద్ మేయర్ ఘనస్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తరువాత బొలా రంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భం గా మినిస్టర్ ఇన్‌వెయిటింగ్‌గా మంత్రి సీతక్కను తెలంగాణ ప్ర భుత్వం నామినేట్ చేసింది. రాష్ట్రపతికి స్వాగతం పలకడం నుం చి ఆమె నగరం విడిచి వెళ్లే వరకు రాష్ట్రపతి వెంట సీతక్క ఉండ నున్నారు. రాష్ట్రపతి పర్యటనలో ఎక్కడా ఏ చిన్న అసౌకర్యం కల గకుండా కార్యక్రమాలను ఆమె సమన్వయం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News