Monday, December 23, 2024

భూమి సమ్మాన్ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం తొమ్మిది రాష్ట్రాల కార్యదర్శులకు, 68 జిల్లాల కలెక్టర్లకు భూమి సమ్మాన్ అవార్డులను ప్రదానం చేశారు. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డుల మోడర్నైజేషన్ ప్రోగ్రామ్‌ను అమలులో ఆయా కార్యదర్శులు, కలెక్టర్లు విజయాలు సాధించినందుకు ఈ అవార్డుల ప్రదానం జరిగింది. ఈ డిఐఎల్‌ఆర్‌ఎంపి కార్యక్రమం కింద లక్షాలు సాధించినందుకు వారిని రాష్ట్రపతి ముర్ము అభినందించారు.

భూ రికార్డులు డిజిటలైజేషన్ చేయడం గ్రామీణ ప్రాంతాల అభివృద్దిలో ముఖ్యపాత్ర వహిస్తుందని పేర్కొన్నారు. దేశం మొత్తం మీద అభివృద్ధికి గ్రామీణాభివృద్ది ఎంతో అవసరమని, భూమి రికార్డులు ఆధునికీకరించడం భూములపై ఆధారపడి జీవిస్తున్న గ్రామీణ జనాభాకు కనీస అవసరమని, తద్వారా దేశ సమగ్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది భూమి రికార్డులు తమ పూర్వీకుల పేరుపై ఉన్నాయని, అయితే సమాచారం లోపం వల్ల తగవుల వల్ల చాలావరకు అవి రిజిస్ట్రేషన్‌కు నోచుకోవడం లేదన్నారు. అలాంటి కేసులను ప్రభుత్వం పరిష్కరించేలా ప్రయత్నించాలని సూచించారు.

కేంద్ర పంచాయతీ రాజ్ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ భూమి రికార్డుల డిజిటలైజేషన్ వల్ల సంబంధిత ప్రజలు తమ ఆస్తులపై రుణాలు పొందే వీలు కలుగుతుందని పేర్కొన్నారు.. కేంద్రగ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే భూమి రికార్డుల డిజిటలైజేషన్ 94 శాతం వరకు పూర్తయిందన్నారు. మిగతా శాతం వచ్చే మార్చికి పూర్తవుతుందన్నారు. భూమి రికార్డుల డిజిటలైజేషన్ ,రిజిస్ట్రేషన్ వల్ల భూతగాదాలు చాలా వరకు పరిష్కారమవుతాయని, కోర్టులో పెండింగ్‌లో ఉన్న భూముల కేసులు పరిష్కారమై ప్రాజెక్టులు ఆగిపోవడం తగ్గుతుందని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ అభిప్రాయపడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News