Sunday, November 24, 2024

పోలీసు అధికారులు టెక్నాలజీ రంగంలో అప్‌డేట్‌గా ఉండాలి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నేరస్థులు కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్)ను ఉపయోగించడాన్ని , డీప్‌ఫేక్ వీడియోలు, ఫోటోల సమస్యనె రాష్ట్రపతి ద్రౌపది మేర్ము ప్రస్తావిస్తూ, పోలీసు అధికారులు నిరంతరం టెక్నాలజీ రంగంలో అప్‌డేట్‌గా ఉండాలని సూచించారు. రాష్టరపతి భవన్‌లో శనివారం తనను కలిసిన 2022 బ్యాచ్ ఐపిఎస్ ప్రొబేషనర్లనుద్దేశించి ఆమె మాట్లాడుతూ పోలీసు బలగాలకు సైబర్ నేరాలు, డ్రగ్స్ ముఠాలు, వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం లాంటి అనేక సవాళ్లు ఉన్నాయన్నారు.‘ కొత్త టెక్నాలజీ, సోషల్ మీడియా ప్రవేశంతో పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. ప్రత్యుత్పత్తి చేయగల కృత్రిమ మేధను క్రిమినల్స్ ఉపయోగించడం, డీప్ ఫేక్ లాంటి సమస్యలు వెలుగు చూస్తున్నాయి’ అని రాష్ట్రపతి అన్నారు.

పోలీసు అధికారులు ఎల్లప్పుడూ టెక్నాలజీ రంగంలో అప్‌డేట్‌గా ఉండాలని, క్రిమిల్స్‌పై పైచేయిగా ఉండాలని ఆమె సూచించారు. పోలీసు పరిపాలన, శాంతిభద్రతల బాధ్యత ప్రధానంగా రాష్ట్రప్రభుత్వాలపైనే ఉంటుందని ద్రౌపది ముర్ము అన్నారు. అయితే రాష్ట్రప్రభుత్వాలు నియమించే పోలీసు సిబ్బందికి ఐపిఎస్ అధికారులు తగిన నాయకత్వాన్ని అందించాలని, ఈ విధంగా దేశ పోలీసు వ్యవస్థను సంఘటితంగా ఉంచే బాధ్యత అఖిత భారత పోలీసు సర్వీసుపై ఉందని రాష్ట్రపతి అన్నట్లు రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. అమృత్‌కాల్‌లో భారత్‌ను అభివద్ధి చెందిన దేశంగా చేయాలన్న కృతనిశ్చయాన్ని నెరవేర్చడంలో పోలీసు అధికారులు నిర్ణయాత్మక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని కూడా ద్రౌపది ముర్ము అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News