Thursday, January 23, 2025

రాష్ట్రపతి ముర్ము తొలిసారి యుద్ధ విమానంలో…

- Advertisement -
- Advertisement -

గువాహటి: భారత రాష్ట్రపతి తొలిసారి సుఖోయ్- 30 ఎంకెఐ యుద్ధ విమానంలో ఆకాశంలో చక్కర్లు కొట్టారు(సార్టీ). అస్సాంలోని తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి శనివారం ఆమె ఈ యుద్ధ విమానం ద్వారా చక్కర్లు కొట్టారు. భారత త్రివిధ దళాల సుప్రీం కమాండర్ అయిన ఆమె అస్సాంకు మూడు రోజుల పర్యటన సందర్భంగా ఈ విమాన సార్టీలు చేపట్టారు. ఆమె చివరికి సురక్షితంగా నేలపై దిగారు. మాజీ రాష్ట్రపతి ప్రతిభ పాటిల్ 2009లో యుద్ధ విమానంలో ప్రయాణించారన్నది ఇక్కడ గమనార్హం.

రాష్ట్రపతి ముర్ము ఏప్రిల్ 6న కజిరంగ నేషనల్ పార్క్‌కు వెళ్లి దానిని ప్రారంభించారు. ఏప్రిల్ 7న ఆమె కంచనజంగ పర్వత సాహసయాత్ర-2023కు జెండా ఊపారు. గువాహటిలో గౌహతి హైకోర్టు 75వ వార్షికోత్సవ సందర్భంగా ఓ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. గౌహతి పార్క్‌లో ‘గజ్ ఫెస్టివల్’ను కూడా ఆమె ప్రారంభించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News