Sunday, January 5, 2025

11 మంది పిల్లలకు బాల పురస్కారాలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అసాధారణ విజయాలు సాధించిన 11 మంది పిల్లలకు ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (పిఎంఆర్‌బిపి) 2023 లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం రిపబ్లిక్ డే సందర్భంగా ప్రదానం చేస్తారు. ఈ అవార్డులు పొందిన బాలలతో మంగళవారం ప్రధాని మోడీ కలుసుకుని అభినందిస్తారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ కూడా ఈ బాలలను అభినందిస్తారు. ఈ సందర్భంగా ఆ శాఖ సహాయ మంత్రి ముంజ్‌పర మహేంద్రభాయి కూడా పాల్గొంటారని అధికారిక ప్రకటన పేర్కొంది.

11రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఈ 11 మంది బాలల్లో ఆరుగురు బాలురు కాగా, ఐదుగురు బాలికలు. అవార్డు గ్రహీతలు ఒక్కొక్కరికి మెడల్, రూ. లక్ష నగదు బహుమతి, సర్టిఫికెట్ ఇస్తారు. ఈ అవార్డు 5 నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలకే పరిమితం చేశారు. సాంస్కృతికం, సాహసం, నూతన ఆవిష్కరణ, పాండిత్యం, సామాజిక సేవ, క్రీడలు, తదితర ఆరు కేటగిరీల్లో అసాధారణ ప్రతిభ చూపించేవారే ఈ అవార్డుకు అర్హులవుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News