Sunday, January 5, 2025

ఎప్పటికైనా గాంధేయ వాదంతోనే ప్రపంచ క్షేమం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇప్పటి ఎప్పటి అత్యవసరమైన ప్రపంచ శాంతిని గాంధేయ మార్గంతో సాధించుకోవచ్చునని, తద్వారా శాంతిని పొందవచ్చునని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ తెలిపారు. ఇక్కడి జాతిపిత స్థారక స్థలి రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి సోమవారం 12 అడుగులు ఎతైన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి గాంధీ ధర్శన్‌లో నెలకొన్న మహాత్మా భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన తరువాత రాష్ట్రపతి మాట్లాడారు. గాంధీజి వసుధైక కుటుంబం అనే సిద్ధాంతాన్ని విశ్వసించారని, ఈ విధంగా ప్రపంచ మంతా ఒక్కటే అని చాటి చెపుతూ సహోదరభావాన్ని నెలకొల్పారని రాష్ట్రపతి తెలిపారు. త్వరలోనే భారతదేశం ఆధ్వర్యంలో జి 20 సదస్సు జరుగుతుంది. దేశ రాజధాని ఢిల్లీ ఇందుకు వేదిక కానుంది. భారతదేశం పలు విధాలుగా ప్రపంచ స్థాయి సౌభాతృత్వాన్ని, సహకారాన్ని, శాంతిసంక్షేమాలను ప్రోత్సహించేందుకు పాటుపడుతోందని తెలిపారు.

గాంధీజీ ఈ మానవాళికి దక్కిన అమూల్యమైన కానుక. తన జీవిత ఆశయాలే ఈ ప్రపంచానికి మార్గదర్శకాలు అయ్యాయి. ఆయన విలువలు , ఆలోచనలు సిద్ధాంతాలు ఈ ప్రపంచ గతిని మార్చేవిగా ఉన్నాయని తెలిపారు. దక్షిణాఫ్రికాలోని నెల్సన్ మండేలా మొదలుకుని పౌర హక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్, బరాక్ ఒబామా వంటి వారు మహాత్మా గాంధీ ప్రబోధించిన అహింసా మార్గాన్ని కొనియాడారు. ప్రపంచస్థాయి ప్రగతి విలసిల్లేందుకు ఈ అహింస మార్గదర్శి అవుతుందని తెలిపారని రాష్ట్రపతి గుర్తు చేశారు. గాంధీ ఆశయాలు కాలానికి అతీతంగా అజరామరం, సంక్లిష్టతల నడుమ కొట్టుమిట్టాడుతున్న ప్రస్తుత ప్రపంచం కూడా గాంధీజీ ఆశయాలను పాటించడం ద్వారా శాంతిని స్థిరత్వాన్ని సొంతం చేసుకోవచ్చునన్నారు.

గాంధీజీ వివిధ భంగిమల సమాహారంగా గాంధీ వాటిక
రాష్ట్రపతి సోమవారం గాంధీజీ స్మారక స్థలిలోనే గాంధీ వాటికను కూడా ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ తమ జీవన దశలలో పలు కోణాలలో ఉన్నప్పటి భంగిమలను తెలియచేస్తూ ఇక్కడ వందలాది గాంధీజి విగ్రహాలను నెలకొల్పారు. గాంధీ దర్శన్‌కు సమీపంలోనే దీనిని ఏర్పాటు చేశారు. జి 20 సదస్సుకు, వివిధ సందర్భాలలో ఇక్కడికి వచ్చే విదేశీ ప్రముఖులు, పర్యాటకులు గాంధీవాటికను సందర్శించుకుంటారని, ఈ విధంగా స్ఫూర్తి పొందుతారని రాష్ట్రపతి తెలిపారు. ప్రత్యేకించి రేపటి తరానికి ప్రతీకలైన బాలలకు ఈ వాటిక విలువైన స్థలి అవుతుందన్నారు. కార్యక్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా, గాంధీ దర్శన్ ఉపాధ్యక్షులు విజయ్ గోయల్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News