- Advertisement -
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మే1న అయోధ్య రామాలయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తారని రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. రామాలయ నిర్మాణం పూర్తయి, జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తరువాత రాష్ట్రపతి అయోధ్యను సందర్శించడం ఇదే మొదటిసారి. అయోధ్యలో ప్రభుశ్రీ రామాలయం,కుబేర్ తీలా, హనుమాన్ గర్హి ఆలయాలను సందర్శించి దర్శనం చేసుకుని ఆరతి సమర్పిస్తారని ప్రకటించారు. సరయూ పూజ, ఆరతి కూడా నిర్వహిస్తారని ప్రకటనలో పేర్కొన్నారు.
- Advertisement -